GDWL: అలంపూర్ పురపాలక పరిధిలోని 8వ వార్డు న్యూప్లాట్స్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ క్లీనింగ్ పనులను కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు స్వయంగా పర్యవేక్షించారు. మున్సిపల్ కార్మికులతో కలిసి పనులను చేయిస్తూ, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వార్డు ఆఫీసర్ శరత్, సిబ్బంది సామెల్ పాల్గొని పనుల పురోగతిని పరిశీలించారు.