MBNR: పాలమూరు యూనివర్సిటీలో యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఓ రెండు ఫౌండేషన్లు ముందుకొచ్చాయి. ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్‌ను కలిసి ఈ విషయంపై చర్చించారు. యువతకు లైఫ్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్స్, ఎంబ్రాయిడరీ వంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.