WNP: రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి షేక్ మున్నా మంగళవారం అన్నారు. శ్రీరంగాపూర్ మండలం వెంకటాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా పంపిణీని ఆయన పర్యవేక్షించారు. గోదాంలో నిల్వ అయిపోయిన వెంటనే మరుసటి రోజుకే యూరియా అందుబాటులోకి వస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు.