MDCL: ఉప్పల్ స్కైవాక్పై జారి పడిన ఘటనలో ఓ వ్యక్తికి తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. స్కైవాక్పై ఉన్న టైల్స్ నునుపుగా ఉండటంతో వర్షం కురిసినప్పుడు ప్రజలు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి స్కై వాక్‌పై గ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.