PDPL: మంథని మండలం ధర్మారం బస్టాండ్ ప్రమాదకరంగా మారింది. పిల్లర్లు, పైకప్పు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఎండలో, వర్షంలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నూతన బస్టాండ్‌ను రోడ్డుకు దగ్గరగా ప్రజలకు అందుబాటులో నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.