ADB: మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (MSDP)ను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిపాలన, కళా అకాడమీ సహకారంతో ఆధ్వర్యంలో ఈ నెల 24న పట్టణంలోని స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి కార్యక్రమం దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.