MDK: రామాయంపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో వివిధ కేసుల్లో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 11న ఉదయం 11 గంటలకు రెండు ద్విచక్ర వాహనాలను బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆసక్తి గలవారు వేలంపాటలో ధరావతు చెల్లించి పాల్గొనాలని సూచించారు.