SKLM: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.