WNP: దీపావళి పండుగ నేపథ్యంలో సైబర్ మోసగాళ్ల ఉచ్చులో ప్రజలు చిక్కుకునే అవకాశం ఉందని రాష్ట్ర పోలీస్ శాఖ హెచ్చరించింది. నకిలీ షాపింగ్ సైట్లు, ఫిషింగ్ లింక్లు, హానికరమైన యాప్లను సృష్టించి గాడ్జెట్లు, బహుమతులంటూ సైబర్ మోసగాళ్లు మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.