WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని విశ్వ జెనిత్ పాఠశాల విద్యార్థిని ఆర్. రితిక “సేఫ్ ఐ గార్డ్ ఫర్ మొబైల్” ప్రాజెక్టుతో ఇన్స్పైర్ 2024-26 అవార్డుకు సోమవారం ఎంపిక కావడంతో పాఠశాలలో హర్షం వ్యక్తమైంది. ప్రిన్సిపల్ ఎర్రబెల్లి హరికుమార్ మాట్లాడుతూ.. విద్యార్థిని, గైడ్ టీచర్లు వసంత, శ్వేతలను ఉపాధ్యాయ బృందంతో కలిసి ప్రత్యేకంగా అభినందించామని తెలిపారు.