ADB: జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యాసకులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, కేవలం పెన్, ప్యాడ్ మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.