RR: చింతలకుంట బస్ స్టాప్ వద్ద డివైడర్ వెడల్పు వల్ల ఏర్పడుతున్న సమస్యను ట్రాఫిక్ అధికారులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు డివైడర్ వెడల్పును తగ్గించాలని ఆదేశించారు. దీనివల్ల సర్వీస్ రోడ్డు ప్రయాణికులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు.