MHBD: తొర్రూరు నుంచి పుట్టపర్తికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం నడపనున్నట్లు డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు. ఈనెల 22న తొర్రూరు నుంచి బస్సు బయలుదేరి ఉదయం పుట్టపర్తికి చేరుకుంటుందన్నారు. టికెట్ ధర రూ.2,500 నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలు కోసం 8074474984, 7032182456 నెంబర్లలో సంప్రదించాలన్నారు.