KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడు వివాహ వేడుకలకు కొన్ని అనివార్య కారణాలవల్ల హాజరు కాలేకపోయారు. శుక్రవారం భట్టి విక్రమార్క నివాసానికి చేరుకొని నూతన దంపతులైన సూర్య విక్రమ్ ఆదిత్య, సాక్షిను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.