SDPT: హుస్నాబాద్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.