KMR: మాచారెడ్డి మండలంలోని రత్నగిరిపల్లి గ్రామంలో గురువారం రాత్రి దాబాపై పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 17.64 లీటర్ల ఐఎంఎల్ మద్యం, 21.1 లీటర్ల బీర్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.24,679 విలువ చేసే 38.74 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.