NZB: రేపు జిల్లావ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసనలు నిర్వహించనున్నట్లు జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ గురువారం తెలిపారు. నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు.