HYD: గచ్చిబౌలిలోని ఓ రెస్టారెంట్లో ఆహారంలో బొద్దింక దర్శనమిచ్చింది. బాధితుడు రాజేశ్ వివరాలు.. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినే సమయంలో ప్లేట్లో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయాడు. దీనిపై GHMC అధికారులు చర్యలు తీసుకోవాలి అని రాజేశ్ కోరాడు.