JGL: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బోదనపు నటరాజుకు అభిలాష హెల్పింగ్ హాండ్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నంది అవార్డును అందజేశారు. చిన్నతనం నుంచి పాటలు పాడటంలో ప్రతిభకనబరుస్తున్న నటరాజును గుర్తించి అవార్డును అందజేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నటరాజును గ్రామస్తులు, తోటి స్నేహితులు అభినందించారు.