JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత 38 రోజులకు గాను 13 హుండీల ద్వారా రూ. 74,74,174 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో అంజనా రెడ్డి తెలిపారు. హుండీల్లో లభించిన బంగారం,వెండి వస్తువులను సీల్ చేసి భద్రపరిచారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో లలితా సేవా ట్రస్ట్ ప్రతినిధులు, ఆలయ అర్చకులు, బ్యాంకు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.