WGL: వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంబాద్కు చెందిన దినేష్(25) తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనం డివైడర్ను ఢీకొట్టడంతో కుడికాలు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ దాసరి సాంబయ్య, ఈఎంటీ పాలడుగుల రవి ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.