NGKL: తాడూర్ మండలంలోని ఐతోల్ గ్రామంలో నేడు ఛత్రపతి శివాజి మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ పాల్గొంటారని అన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.