సిద్దిపేట జిల్లా ఉప్పర్ పల్లిలో ఆదివారం 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఓ మహిళకు సురక్షితంగా ప్రసవం చేశారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి నొప్పులు అధికం కావడంతో EMT నవీన్, పైలట్ ఎల్లయ్య ఇంటి వద్దే ప్రసవం నిర్వహించారు. మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వగా, తల్లి బిడ్డను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.