KMM: ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్ 365 బీజీ) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఎన్ హెచ్ 65, ఎన్హెచ్ 16ను కలుపుతూ రూ.4451.87 కోట్లతో 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు.