MHBD: తొర్రూరు మండలంలోని టీక్యా తండాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో తొర్రూరు పోలీసులు, సీసీఎస్ బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తొర్రూరు DSP కృష్ణ కిషోర్ వెల్లడించారు.