ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన మిర్చి వ్యాపారి బండారు మోహన్ రావు (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భార్య ఊరెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఆయన, శనివారం తీవ్రమైన ఎండలో తిరిగి వచ్చారు. సోమవారం ఇరుగుపొరుగు వారికి ఇంట నుంచి దుర్వాసన రావడంతో ఆయన మరణించినట్లు వెలుగులోకి వచ్చింది.