HYD: అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం జరుగుతోందని పాండు నాయక్ ఫిర్యాదు చేస్తూ.. మంత్రి గౌరవాన్ని దెబ్బతీసే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన HYD సైబర్ క్రైమ్ పోలీసులు, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారు. అయితే, దీనిపై క్రిశాంక్ CBI దర్యాప్తుకు డిమాండ్ చేశారు.