SDPT: కొండపాక మండలం దర్గా, రాంపల్లి, గిరాయిపల్లి, రవీంద్ర నగర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ ఛైర్మన్, స్థానిక సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.