JGL: ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి, పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీవోలు, ఏఈలు, ఉపాధి హామీ సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. పనులు పూర్తయిన వెంటనే బిల్లులను ఆన్లైన్లో జనరేట్ చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయించాలని సూచించారు.