WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరని సర్పంచ్ శంకర్, కార్యదర్శి రఘు మంగళవారం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత దృష్ట్యా అనుమతి పొందిన ఫ్లెక్సీలను గరిష్టంగా 5 రోజులు మాత్రమే ఉంచాలని సూచించారు. బర్త్‌డేలు, ఫంక్షన్లలో క్రాకర్లు కాల్చితే రూ.2 వేల వరకు జరిమానా విధించనున్నట్లు వారు తెలిపారు.