JN: స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ వినయ్ కుమార్ ప్రారంభించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. వేసవికాలంలో బాటసారిల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, చలివేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.