HYD: వర్షాకాలం అంటే నగరంలో వనుకే.. ఎప్పుడు వర్షమొచ్చినా రోడ్లపై వరదలా పారుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం మామూలైపోయింది. అందుకే గ్రేటర్ అధికారులు ఈసారి స్పెషల్ మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి రూ.45 కోట్లు ఖర్చుచేసి ప్రత్యేక బృందాలను నియమించనుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు నగరాన్ని వర్షపు ఇబ్బందుల నుంచి కాపాడనున్నాయి.