SRCL: బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలుస్తారని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ పాల్గొన్నారు.