WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొండేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.