KNR: విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉన్నదని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే సత్యనారాయణ చేతుల మీదుగా సోమవారం బూట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కార్యకర్తలు ఉన్నారు.