SRPT: కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో తొంటి ఎముక విరిగిన గిర్ జాతి ఆవు దూడకు డాక్టర్ పీ.పెంటయ్య బృందం అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి దూడ ప్రాణాలను కాపాడిన వైద్యులను జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మధు, సురేంద్ర, చంద్రకళ తదితరులు పాల్గొని చికిత్సలో సహకరించారు.