»Wearable Ac A Small Pocket Ac That Can Be Easily Worn On The Neck And Carried Anywhere
Wearable AC: మెడపై ఈజీగా ధరించి.. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే చిన్న పాకెట్ ఏసీ!
ఎక్కడికైనా వెళ్తే ఈజీగా ధరించగలిగే చిన్న ఏసీ డివైజ్‌ను సోనీ ఇటీవల విడుదల చేసింది. మెడపై తగిలించుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మరి ఇది ఎక్కడ లభ్యం అవుతుందో వివరాల్లో తెలుసుకుందాం.
Wearable AC: A small pocket AC that can be easily worn on the neck.. and carried anywhere!
Wearable AC: ఎక్కడికైనా వెళ్తే ఈజీగా ధరించగలిగే చిన్న ఏసీ డివైజ్‌ను సోనీ ఇటీవల విడుదల చేసింది. మెడపై తగిలించుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చలి, వేసవి కాలాల్లో కూడా ఉపయోగపడుతుంది. రియాన్ పాకెట్-5 అని పిలిచే దీనిని ఆన్ చేయగానే అది మన శరీర, పరిసరాల ఉష్ణోగ్రతను సరిపోలుస్తుంది. ఆటోమేటిక్‌గా కూలింగ్ లేదా వార్మింగ్ టెంపరేచర్‌ను సెట్ చేస్తుంది. ప్రత్యేకంగా దాన్ని మనం నియంత్రించాల్సిన అవసరమేమీ ఉండదు. మన కదలికలను బట్టి అక్కడి పరిసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మారుస్తుంది.
కావాలనుకుంటే మొబైల్ యాప్‌లో ప్రత్యేకంగా కమాండ్స్ ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. దీన్ని ప్రత్యేకంగా ఆన్ లేదా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మెడపై పెట్టుకోగానే పనిచేస్తుంది. తీసి పక్కన పెడితే ఆగిపోతుంది. రియాన్ పాకెట్లో మొత్తం ఐదు సెన్సర్లు ఉంటాయి. దీనికి ఒక పాకెట్ ట్యాగ్‌ను కూడా ఇస్తారు. ట్యాగ్ లేకపోయిన డివైజ్ పనిచేస్తుంది. ఈ డివైజ్ బ్యాటరీ లైఫ్ గరిష్ఠంగా 17 గంటలు ఉంటుంది. దీని ధర 1,499 హాంకాంగ్ డాలర్లు. ప్రస్తుతానికి ఇది భారత్‌లో అందుబాటులో లేదు.