»Apple Scary Fast Event 2023 New Products Release Price And Features
Apple Scary Fast Event 2023: ఈవెంట్లో కొత్త పొడక్ట్స్ రిలీజ్..అవి ఏంటంటే
యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఉత్పత్తులను ప్రకటించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కంపెనీ మ్యాక్‌బుక్ ప్రో, M3, M3 ప్రో, M3 మ్యాక్స్ చిప్‌లను విడుదల చేసింది. ఆపిల్ కొత్త M3 చిప్సెట్తో iMac అప్‌గ్రేడ్‌ను కూడా ప్రకటించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Apple Scary Fast Event 2023 New products release price and features
ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ 2023 సందర్భంగా కంపెనీ నాలుగు ఉత్పత్తులను ప్రకటించింది. ఈ ప్రకటనలలో కొత్త Apple Silicon లైనప్, కొత్త iMac, కొత్త MacBook Pro, కొత్త ఎంట్రీ-లెవల్ MacBook Pro ఉన్నాయి. ఈ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి కూడా వచ్చాయి. దీనితో పాటు ధర కూడా వెల్లడైంది. వీటితోపాటు ఆపిల్ M3 చిప్‌లను కూడా విడుదల చేసింది. లైనప్‌లో M3, M3 ప్రో, M3 మాక్స్ చిప్‌లు ఉన్నాయి. ఈ చిప్స్ 3nm టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడ్డాయి. GPUని మెరుగుపరచడానికి, Dynamic Cache అనే కొత్త కాష్ సిస్టమ్ ఉపయోగించబడింది. M3 చిప్‌లు 128GB వరకు మెమరీ సపోర్ట్ అందిస్తాయి. అత్యంత శక్తివంతమైన M3 మాక్స్ చిప్ 92 బిలియన్ ట్రాన్సిస్టర్లు, 40-కోర్ GPU, 16-కోర్ CPUతో వస్తుంది. 24-అంగుళాల iMac M3 చిప్ కూడా రిలీజ్ కాగా..ఇది మునుపటి M1 కంటే రెండు రెట్లు వేగంగా పని చేస్తుంది. కొత్త చిప్‌తో కూడిన iMac 1 బిలియన్ కంటే ఎక్కువ రంగులతో 4.5K రెటీనా డిస్ప్లే, Wi-Fi 6E సపోర్టును కల్గి ఉంది. ఈ మోడల్ 24GB వరకు మెమరీని కలిగి ఉండగా.. ఏడు రంగులలో వస్తుంది.
ఆపిల్ 14, 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్లను విడుదల చేసింది. ఇవి M3 ప్రో చిప్ లేదా హై-ఎండ్ M3 మ్యాక్స్‌తో వస్తాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు కొత్త మినీ LED డిస్ప్లేలు, 1080p కెమెరా, ఆరు-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 22 గంటల బ్యాటరీ లైఫ్, 128GB వరకు RAM వంటి ఫీచర్లతో వస్తాయి. ఇది కాకుండా కంపెనీ M3 చిప్‌తో వచ్చే ఎంట్రీ లెవల్ 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోని కూడా విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ ధర 1,599 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి మోడల్ కంటే 60 శాతం వేగంగా పని చేస్తుంది. ఈ మోడల్లో టచ్ బార్ అందుబాటులో లేదు. 8GB RAM మాత్రమే కలిగి ఉండగా.. సిల్వర్, గ్రే వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పరికరం ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. నవంబర్ 7న అధికారికంగా మార్కెట్లోకి రానుంది.
ఆపిల్ ఇటీవల భారతదేశంలో తన కొత్త 14, 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధరలను ప్రకటించింది. M3 చిప్‌తో కూడిన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.169,900 నుంచి ప్రారంభమవుతుంది. M3 ప్రో చిప్‌తో కూడిన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 199,900 నుంచి మొదలవుతుంది. అయితే 16 అంగుళాల మోడల్ ధర రూ.249,900 నుంచి మొదలు కాగా.. M3 మ్యాక్స్ చిప్‌తో కూడిన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.319,900, 16 అంగుళాల మోడల్ ధర రూ.349,900గా ప్రకటించారు.