»Team India Showed Their Strength In The First Test
India vs Australia 1st Test: తొలి టెస్టులో టీమిండియా అదిరిపోయే ఆరంభం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ తొలి టెస్టులో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. బౌలింగ్ లో జడేజా(jadeja) రెచ్చిపోయాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma) అటాకింగ్‌తో మొదటి రోజు పూర్తిగా ఇండియానే పైచేయి సాధించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ తొలి టెస్టులో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. బౌలింగ్ లో జడేజా(jadeja) రెచ్చిపోయాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma) అటాకింగ్‌తో మొదటి రోజు పూర్తిగా ఇండియానే పైచేయి సాధించింది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకు టీమిండియా కట్టడి చేసింది. ఇకపోతే తొలి రోజు ముగిసే సమయానికి ఓ వికెట్ నష్టానికి టీమిండియా 77 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కంటే మరో 100 పరుగులు వెనుకంజలో టీమిండియా ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి రోహిత్ శర్మ ధాటిగా ఆడాడు. ఇకపోతే మరో బ్యాటర్ రాహుల్ ఆచితూచి ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై రోహిత్ బౌండరీలతో చెలరేగిపోయాడు.
కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 1 సిక్స్ తో రోహిత్ శర్మ(rohith sharma) హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి అతడు 69 బాల్స్ లో 56 రన్స్ చేసి మొదటి రోజు అజేయంగా నిలిచాడు. రాహుల్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇకపోతే మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన భారత్ తన ప్రతాపాన్ని చూపింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా(jadeja) టెస్టుల్లో 11వ సారి ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి ఆసిస్ బ్యాటర్లను తికమకపెట్టాడు. జడేజా దెబ్బకు ఒక దశలో 2 వికెట్లకు 84 పరుగులతో ఉన్న ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ కూడా ఈ టెస్టు మ్యాచ్‌లో 450వ వికెట్ తీసి రికార్డు సృష్టించాడు.
Stumps on Day 1️⃣ of the first #INDvAUS Test!#TeamIndia finish the day with 77/1, trailing by 100 runs after dismissing Australia for 177 👌🏻
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు భారత పేసర్లు మొదట్లోనే షాకిచ్చారు. ఓవైపు సిరాజ్, మరోవైపు షమి ఇద్దరూ ఆస్ట్రేలియా బ్యాటర్లను 2 పరుగులకే ఔట్ చేశారు. వరుస వికెట్ల పతనంతో ఆస్ట్రేలియా చతికిల పడింది. దీంతో భారత్ బౌలర్లు ఆసిస్ బ్యాటర్లను మట్టికరిపించారు. ఇకపోతే మొదటి రోజు అటు జడేజా(jadeja) స్పిన్ మాయాజాలం, ఇటు రోహిత్ శర్మ(rohith sharma) బ్యాటింగ్ బాదుడుకు క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తొలి టెస్టులో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది.