Virat Kohli: విరాట్ కొహ్లీ(Virat Kohli) కన్నీరు(tears) పెట్టుకున్నారు. 16 ఏళ్ల తర్వాత ఈసారి ఎలాగైనా కప్ కొట్టేయాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు ఆశలు గల్లంతయ్యారు.ప్లే ఆఫ్స్(play off)కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఓటమిపాలైంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కోహ్లీ సెంచరీతో మరోసారి చెలరేగాడు. ఓ వైపు వరుసగా వికెట్లు పడుతున్నా 61 బంతుల్లోనే 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో బెంగళూరు కచ్చితంగా గెలిచి తీరుతుందని అంతా భావించారు.
కానీ.. ప్రత్యర్థి జట్టు198 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలోనే ఛేదించింది. శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన సెంచరీతో బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు. శుభమ్ గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి అతనూ నాటౌట్ గా నిలిచాడు. కాగా మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి పాలైనందుకు బెంగళూరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా సెంచరీతో మెరిసిన కోహ్లీ కన్నీరు మున్నీరయ్యాడు. మ్యాచ్ ఆఖరిలో డగౌట్లో కూర్చొన్న విరాట్.. తన జట్టు ఓటమితో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. అయితే క్రీడాస్ఫూర్తిని చాటుకుంటూ మైదానంలోకి వచ్చి సహచర ఆటగాళ్లను అభినందించాడు. అయితే మ్యాచ్‌లో కోహ్లీ కన్నీరు పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది తన అభిమానులను బాధపెట్టిస్తోంది. ఈ సమయంలో విరాట్‌కు ఫ్యాన్స్ ‘ గెలిచినా.. ఓడినా.. ఎప్పటికీ నువ్వు మా కింగ్‌వే’ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.