మూడో వన్డేలో కివీస్ ముందు టీమిండియా భారీ లక్ష్యం ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీరవిహారం చేశారు. సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. రోహిత్, గిల్ ఔటయినా తర్వాత ఎక్కువ సేపు నిలదొక్కుకోలేదు. కోహ్లీ 36 పరుగులు చేసి వెనుదిరిగాడు. హర్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేశాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డప్పీ బౌలింగ్లో ఓటయ్యాడు. మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి వైట్ వాష్ చేయాలని అనుకుంటోంది.