MS ధోనీపై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా ప్రశంసల వర్షం కురిపించారు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోనీ ఎంతో కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘గౌరవ హోదాలో కేటాయించిన పదవులకు కఠిన శిక్షణ తప్పనిసరి కాదు. అయినప్పటికీ, ధోనీ స్వయంగా ముందుకొచ్చి ఆ కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాడు. అతడు సిసలైన సైనికుడిగా వ్యవహరించాడు’ అని భాటియా కొనియాడారు.