క్రికెటర్ క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్ టీంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు. ఐపీఎల్‌కు పేరు తెచ్చినా నన్ను చిన్న పిల్లాడిలా చూశారు’ అని అన్నారు. ఈ కారణంగా తొలిసారి డిప్రెషన్లోకి వెళ్లానని, అనిల్ కుంబ్లేతో మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించారు. రాహుల్ ఉండమని చెప్పినా వినకుండా తాను జట్టును వీడినట్లు తెలిపారు.