భారత్ తయారు చేసిన అద్భుతమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంటూ ఇంగ్లాండు మీడియా ఆయనపై ప్రశంసలు కురిపించింది. టీ20 క్రిికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బౌలర్ బుమ్రా అంటు కొనియాడారు.
Bumrah: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు(IND vs ENG)లో ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించడంలో బుమ్రా పాత్ర మరవలేనిది. ఈ టెస్టులో బుమ్రా మొత్తం 9 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో సిరీస్‌ను 1-1తో సమం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన బుమ్రాను ఇంగ్లాండ్ మీడియా ఆకాశానికి ఎత్తింది. ఆయన వేసిన ప్రతీ బాల్ ఓ అద్భుతం అని మీడియా రాసుకొచ్చింది. బుమ్రా విసిరిన బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ బెన్‌స్టోక్స్ అయితే బుమ్రా విసిరిన బంతిని ఆడలేక ఔటైన అనంతరం బ్యాట్ కిందపడేయడం నెట్టింట్లో వైరల్ అయింది. మ్యాచ్ తరువాత బుమ్రా అద్భుతమైన బౌలర్ అని స్టోక్స్ అన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండులోని పలు మీడియా పత్రికలు బుమ్రా గురించి ఈ విధంగా రాశాయి.
‘‘టీ20 క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బౌలర్ బుమ్రా. మలింగా నుంచి ఎంతో నేర్చుకున్నాడు. టెస్టు క్రికెట్లో గొప్ప ప్రభావాన్ని చూపించాడు.’’- ది టెలిగ్రాఫ్
‘‘బుమ్రా బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్ల గదుల్లో తెల్లవారుజామున 4 గంటలకే అలారం మోగుతుంది’’-బీబీసీ
‘‘బుమ్రా దిగ్గజ ఆటగాడు. గొప్ప సీమర్. సీమ్ బౌలింగ్ గొప్ప కళ. భారత పిచ్‌లపై మ్యాజిక్ చేస్తాడు’’ -ఇండిపెండెంట్ యూకే.
‘‘బుమ్రా ప్రపంచస్థాయి బౌలర్. రివర్స్ స్వింగ్‌తో అతడు సాధించిన వికెట్లు అత్యంత అద్భుతం’’-ది డెయిలీ మెయిల్