ముంబాయి ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేసింది. దీంతో పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ముంబాయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ తాజాగా స్పందించారు.
Mumbai Indians: ముంబాయి ఇండియన్స్ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేసింది. దీంతో పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రోహిత్ శర్మ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ముంబాయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఈ విషయంపై తాజాగా స్పందించాడు. రోహిత్‌పై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికే కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించామని ఓ పోడ్కాస్ట్లో తెలిపారు. బ్యాటింగ్ విషయంలో రోహిత్ గత రెండు సీజన్లలో అంత బాగా రాణించలేదు. కానీ కెప్టెన్‌గా అయితే బాగానే ఉన్నాడు.
ముంబాయి, టీమ్ఇండియా కెప్టెన్‌గా రోహిత్‌కి మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం అతను తీరిక లేకుండా ఉంటున్నాడు. అందుకే అతని మీద ఒత్తిడి తగ్గించాలనుకున్నమని బౌచర్ తెలిపాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ 20 సగటు, 126.84 స్ట్రైక్‌రేట్‌తో 600 పరుగులు చేశాడు. ఆటగాడిగా అతడు ఇప్పటికీ జట్టులో ఉండాలనుకుంటున్నాం. కెప్టెన్ అన్న భారం లేకుండా అతడు బరిలోకి దిగి ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నామని అన్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా ఆడితే అతడి నుంచి అత్యుత్తమ ఆట రావొచ్చని భావిస్తున్నామని బౌచర్ చెప్పాడు.