»Rayachoti The Ycp Leaders Attacked The Staff Who Stopped The Car At The Tollgate
Rayachoti: టోల్గేట్ వద్ద కారు ఆపారని.. సిబ్బందిపై వైసీపీ నేతల దాడి
అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో ఉన్న టోల్గేట్ సిబ్బందిపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. టోల్గేట్ వద్ద తమ వాహనానికి గేటును వెంటనే తీయలేదంటూ సిబ్బందిపై దాడి చేశారు.
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో ఉన్న టోల్గేట్ సిబ్బందిపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. టోల్గేట్ వద్ద తమ వాహనానికి గేటును వెంటనే తీయలేదంటూ సిబ్బందిపై దాడి చేశారు. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం గొల్లపల్లె ఎంపీటీసీ శ్రీలత భర్త శివశంకర్ నాయుడు కొంతమందితో కలిసి వాహనంలో నిన్నరాత్రి టోల్గేట్ చేరుకున్నారు. అప్పటికే గేట్ పడింది.
బిల్లు ఎంటర్ చేసి తెరిచే లోపు తన కారునే ఆపుతారా? అని కౌంటర్లోని సిబ్బందిని బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చిన వాళ్లను తీవ్రంగా గాయపరిచి వెళ్లిపోయారు. గాయపడిన వాళ్లను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివశంకర్ గతంలోనూ ఇదే విధంగా దాడి చేశారని బాధితులు రామాపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీసీఫుటేజ్లు చూసి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.