Bumrah: భారత స్టార్ పేసర్ బుమ్రా సేవలను పొదుపుగా వాడుకోవాలని శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ కోరారు. సుధీర్ఘకాలం బుమ్రా సేవలు వాడుకోవాలంటే అన్ని ఫార్మాట్లలో ఆడించకపోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. స్టార్ బౌలర్ విషయంలో బీసీసీఐ తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. జస్ప్రీత్ బుమ్రా యాక్షన్ భిన్నమైంది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.. బుమ్రా లాంటి వారు అన్ని ఫార్మాట్లలో పాల్గొనకూడదు. వారికి అనుకూలమైన పార్మాట్ గుర్తించి, దానివరకే పరిమితం చేయాలని కోరారు.
చమిందావాస్ చెప్పింది నిజమే.. గాయాల వల్ల బుమ్రా పలు కీలక సిరీస్‌ల్లో పాల్గొనలేదు. స్ట్రెస్ ఫ్రాక్చర్ వల్ల గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఆగస్ట్ వరకు ఆటకు దూరంగా ఉన్నారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా అందుబాటులో లేడు. సో.. ఏదైనా ఒక ఫార్మాట్ మాత్రమే ఆడిస్తే బాగుంటుందని.. అన్నింటిల్లో ఆడించొద్దని సూచించారు. అలా చేయడం వెల్ల ఒత్తిడికి గురై.. గాయాల పాలయ్యాడని వివరించారు.
వన్డే, టీ20ల వరకు అయితే ఓకే.. టెస్ట్‌లకు కూడా బుమ్రాను వాడుతున్నారు. వరసగా మ్యాచ్ ఆడటం వల్ల ఒత్తిడికి గురవుతున్నాడు. గాయాల బారిన పడుతున్నాడు. ఇదే విషయాన్ని వాస్ ప్రస్తావించాడు. సో.. బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు.. ఈ విషయంపై దృష్టిసారించాల్సి ఉంది. దాంతోపాటు రోహిత్ శర్మ, కోహ్లి కలిసి వన్డే వరల్డ్ కప్‌లో వంద శాతం ఫలితం చూపిస్తారని అభిప్రాయ పడ్డారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ రేపు శ్రీలంకతో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.