MS Dhoni Bike Riding: యంగ్ క్రికెటర్‌కు లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
మహేంద్ర సింగ్ ధోనీ ఓ యంగ్ క్రికెటర్‌కు లిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన బైక్ రైడింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ధోని చేసిన పనికి అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు.
టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra singh Dhoni) అంటే అందరికీ ఇష్టమే. ఆయన ఏం చేసినా ఓ స్పెషాలిటీ ఉంటుంది. తాజాగా ధోనీ రాంచీలో బైక్2పై ఓ యువ క్రికెటర్‌కు లిఫ్ట్ ఇస్తూ కనిపించాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా మహీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.
ధోనీ బైక్ రైడింగ్ వీడియో:
MS Dhoni giving a lift to a young cricketer on his bike.
42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra singh Dhoni) ఇప్పటికే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రాంచీలో గడుపుతున్నాడు. ఈమధ్యనే న్యూజెర్సీలో ట్రంప్‌తో గోల్ఫ్ కూడా ఆడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ధోనీ గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజా ఓ యంగ్ క్రికెటర్‌కు ధోనీ లిఫ్ట్ ఇచ్చాడు. దీంతో ఆ యువ క్రికెటర్ ఆనందానికి అవధులు లేవు.
రాంచీలో ట్రెయినింగ్ సెషన్ పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరుతున్న ధోనిని ఓ యువ క్రికెటర్ లిఫ్ట్ అడిగాడు. దీంతో ధోనీ ఆ వ్యక్తిని తన బైక్‌పై ఎక్కించుకుని డ్రైవ్ చేశాడు. ఈ వీడియోను ఆ యంగ్ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్ (Video Viral) అవుతోంది. ధోనీ చేసిన పనికి నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎంతైనా ధోనీ ధోనీయే అని, మహీకి ఎవ్వరూ సాటిరారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు ఇప్పుడు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. అందుకే ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చు, అతని స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేరవచ్చు.