»Paralympics 2023 India Medals 111 Modi Praised The Indian Team
Paralympics 2023: ఆసియా పారా గేమ్స్‌లో కూడా భారత్ పతకాల హావా
ఆసియా పారా గేమ్స్‌లో కూడా భారత్ 100 పతకాల మార్కును దాటేసింది. శనివారం ఈ ఘనతను సాధించగా..ప్రధాని మోడీ భారత బృందాన్ని మెచ్చుకున్నారు. యువత తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
paralympics 2023 india medals 111 modi praised the indian team
ఆసియా పారా గేమ్స్‌లో భారత బృందం ఎన్నడూ లేనివిధంగా సెంచరీ పతకాలను దాటేసింది. తమ హాంగ్జౌ ఆసియా పారా గేమ్స్ చివరిరోజును అపూర్వమైన 111 పతకాలతో ముగించారు. ఇది ఏదైనా పెద్ద అంతర్జాతీయ బహుళ-క్రీడా ఈవెంట్లో దేశానికి అతిపెద్ద విజయం. దీంతో 303 మంది సభ్యులతో కూడిన భారత బృందం సరికొత్త రికార్డును బద్దలు కొట్టింది. భారత పారా అథ్లెట్లు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లో అథ్లెట్లు సాధించిన 107 పతకాల కంటే..తాజాగా నాలుగు పతకాలు ఎక్కువ సాధించడం విశేషం. చైనా (521 పతకాలు: 214 స్వర్ణాలు, 167 రజతాలు, 140 కాంస్యాలు), ఇరాన్ (44 స్వర్ణం, 46 రజతాలు, 41 కాంస్యాలు), జపాన్ (42, 49, 59 పతకాలు), కొరియా (30, 33, 40) కంటే దిగువన భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
అయితే భారతదేశం ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా స్పందించారు. భారత యువతకు సాధ్యం కానిది ఏదీ లేదని మోదీ తన ఎక్స్ ఖాతాలో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. “ఆసియా పారా గేమ్స్‌లో 100 పతకాలు! ఇది ఆనందమైన క్షణం. ఈ విజయం మన క్రీడాకారుల పరిపూర్ణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఫలితం. ఈ అద్భుతమైన మైలురాయి మా హృదయాలను అపారమైన గర్వంతో నింపింది. ఈ సందర్భంగా అద్భుతమైన అథ్లెట్లు, కోచ్‌లు, వారితో పని చేస్తున్న మొత్తం బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నానని మోడీ పేర్కొన్నారు. మన యువతకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు.
గావిట్ గోల్డెన్ మెడల్ తర్వాత భారత్ మరో 11 పతకాలతో మొత్తం 111కి చేరుకుంది. దేశం ఇప్పుడు 29 బంగారు, 31 రజత, 51 కాంస్యాలను కలిగి ఉంది. అంతేకాదు ఆసియన్ పారా గేమ్స్‌లో ఆర్చరీ ఉమెన్స్ ఇండివిజువల్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో అసాధారణమైన గోల్డ్ మెడల్ సాధించినందుకు శీతల్ దేవి గురించి మోడీ ప్రస్తావించారు. ఈ ఘనత ఆమె పట్టుదలకు, సంకల్పానికి నిదర్శనమని, ఆమె చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. మొదటి పారా ఆసియా క్రీడలు 2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగాయి, ఇక్కడ భారత్ ఒక స్వర్ణం సహా 14 పతకాలతో 15వ స్థానంలో నిలిచింది. ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు ఇవే అత్యుత్తమ పతకాలు కావడం విశేషం. 2018లో భారత బృందం 72 పతకాలు గెల్చుకుంది.