Siraj Mind Blowing Performance: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. తొలుత బుమ్రా ఓ వికెట్ తీయగా.. తర్వాత మహ్మద్ సిరాజ్ విజృంభించాడు. లంక బ్యాట్స్‌మెన్‌ను ఊపిరి తీసుకోనివ్వకుండా చేశాడు. సిరాజ్ బౌలింగ్ చేయగా వరసగా ఒక్కో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టాడు. వరసగా ఆరు వికెట్లు తీసి.. లంకకు తీవ్రంగా దెబ్బకొట్టాడు. కెరీర్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు.
ఫస్ట్ బౌలింగ్ వేసిని బుమ్రా కుసల్ పెరెరాను ఔట్ చేశాడు. తర్వాత బాల్ తీసుకున్న సిరాజ్.. లంక బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. పథుమ్ నిస్సాంక, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దాసున్ శానకాను పెవిలియన్ పంపించాడు. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంది. ఆట ప్రారంభం అయ్యే కొద్దీ ముందు కూడా వర్షం పడింది. తర్వాత పిచ్ తయారు చేసి మ్యాచ్ స్టార్ట్ చేశాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌ను సిరాజ్ ఊచకోత కోశాడు. లంక టాప్ ఆర్డర్ పేల్చిసిన సిరాజ్ హైదరాబాద్‌కు చెందిన వారు అనే సంగతి తెలిసిందే. సిరాజ్ ఆరు వికెట్లు తీయగా.. పాండ్యా 3, బుమ్రా ఒక వికెట్ తీశారు. 50 పరుగులు చేసి శ్రీలంక ఆలౌట్ అయ్యింది.